ఏమాయెరా ఆరోజులేమాయెరా ?
ఏమాయెరా ఆరోజులేమాయెరా ?
మనసుకు నచ్చినట్టు మాస్కులేకుండా ఉండేటోల్లం
మనస్ఫూర్తిగా దోస్తులను హత్తుకునేటోల్లం
చేయి చేయి కలిపి చేదోడు వాదోడుగుండేటోల్లం
ఒక్క చోట కలిసి మధ్యాన్నం సద్ది తినేటోల్లం
ఏమాయెరా ఆరోజులేమాయెరా ?
ఏమాయెరా ఆరోజులేమాయెరా ?
దొరల్లాగా తిరిగినోల్లం, ముసుగు దొంగలమైతిమి
కనపడని రాకాసి కోరల్లో బందీలమైతిమి
మురికిలో ఆడినోల్లం, మస్తుగా తిరిగినోల్లం,
చేయి కడగటమే పనిగా పెట్టుకుంటిమి
ఏమాయెరా ఆరోజులేమాయెరా ?
ఏమాయెరా ఆరోజులేమాయెరా ?
బిడ్డల భవిష్యత్తు బడిలో ఉందంటూ
వేల వేల ఫీజులు కట్టి కుసుంటిమి
బడ్లేమో తెరుచుకోక బిడ్డల బుక్కులు అటకెక్కే
తరగతి గదులేమో మొబైల్ స్క్రిన్లోకొచ్చే
ఏమాయెరా ఆరోజులేమాయెరా ?
ఏమాయెరా ఆరోజులేమాయెరా ?
ఇళ్లేమో ఆఫీసులయె, ఆఫీసులేమో ముసుకు పోయే,
ఉన్న జాబు ఊడిపోయే, అప్పులేమో ఊపిరాపే,
జీతాలు లేక జీవనమే భారమయే
జీవిత పయనం ఇలా ప్రస్నార్ధకామయే
ఏమాయెరా ఆరోజులేమాయెరా ?
ఏమాయెరా ఆరోజులేమాయెరా ?
వీకెండ్ సినిమా బందాయె
ముందుకు మంచింగ్ లేదాయె
మరుగుతున్న చాయ బందాయె
మటన్ ముక్క బిర్యానీ లేదాయె
ఏమాయెరా ఆరోజులేమాయెరా ?
ఏమాయెరా ఆరోజులేమాయెరా ?
ఏనాడైనా ఆలోచిస్తిమా ఇలాంటి రోజొకటొస్తదని
హాయిగా నవ్వేటోల్లం, ఇప్పుడు ఆ నవ్వు చూసి ఎన్నల్లయెరా
ముసుగులో మూసుకుంది కదరా ఆ నవ్వు
హాయిగా కలుసుకునేటోల్లం, ఇప్పుడు మన మీటింగ్ స్పాటు
వాట్సాప్ కాల్ ఆయే కదరా
ఏమాయెరా ఆరోజులేమాయెరా ?
ఏమాయెరా ఆరోజులేమాయెరా ?
Like this:
Like Loading...