Saaho Flop Because.

అవును సినిమా ఆడదు ఎందుకంటే

1 అందులో అనవసర ముద్దు స్కీన్లు లేవు
2 ఒక బికినీ సీన్ కూడా లేదు
౩ కథ పాతదే
4 హీరో తెలుగోడు పైగా తీసినోడు కూడా తెలుగోడు
5 బాలీవుడ్ నుంచి తెచ్చిన హీరోయిన్ స్కిన్ షో లేదు
6 అంత కంప్లికేటెడ్ గా లేదు, ఈజీగా అర్థమయ్యేలా నీట్ గా స్క్రీన్ప్లే రాసుకున్నాడు కాబట్టి
7 ఒక్క మాస్ బీట్ ఉన్న సాంగ్ కూడా లేదు
8 మన హీరో ఎంట్రీ వర్షంలో ఉంటది, అసలు హీరో ఎంట్రీ అంటే ఒక పది సుమోలైన గాల్లో ఎగరాల్సిందే కానీ అది లేదు
9 ప్రెసెంటేషన్ గ్రాండ్ గా ఉంది
10 గ్రాఫిక్స్ అంత బాగా ఉండేయ్ సరికి వామ్మో మన ఇండస్ట్రీ ఎక్కడ ఎదిగి పోఇద్దో, వద్దు ఏమి లేదు మూవీ లో అనేస్తే పోలా

ఇదే సినిమా కి ఒక నలుగురు తెల్ల వాళ్ళని పెట్టి, డైరెక్టర్ పేరు సుజీత్ కి బదులు సుస్సేన్ డీజిల్ అని పెట్టి, సినిమా పేరు ఫాస్ట్ అండ్ ఫురియస్ 10 అని రిలీజ్ చేస్తే దానెమ్మ 100 కోట్లు చేసేది।

ఇప్పటికి ఎప్పటికి అర్ధం కానీ ఇన్సెప్షన్ అండ్ ఇంట్రస్టేల్లెర్ మూవీస్ ని పొగుడుతాం, కానీ అలాంటి ప్రయోగమే మన తెలుగువాళ్లు చేస్తే కొంచెం కూడా సపోర్ట్ చేయం, అవునులే మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు పొరిగింటి పుల్లకూర రుచి అని

కొత్తదనం లేదు అని అంటున్నారు స్టోరీ లో మరి హాలీవుడ్ రేంజిలో తీసిన మహేష్ బాబు 1 నెంబర్ వన్ ని ఎం చేసారు అర్ధం కాలేదు, ఎం బాలేదు అన్నారు ఇప్పుడు దీన్ని అలాగే పాత స్టోరీ అంటున్నారు

అసలు మనకి ఎం కావాలో మనకీ తెలియదు, కానీ అన్ని తెలిసిన వాళ్ళ లాగా జడ్జ్ చేసేస్తాం

మైండ్ లో ఏది పెట్టుకోకుండా, రివ్యూలు అసలు చదవకుండా వెళ్లి చుడండి, కథ పాతదే అయినా కథనం కొత్తగా ఉంది , డైరెక్షన్ బాగుంది, గ్రాఫిక్స్ బాగుంది, అందరు వారి పాత్రలకు సరైన న్యాయం చేసారు

మనమే ఇండస్ట్రీ ని కాపాడుకోవాలి. మనమే మన తెలుగోడిని సపోర్ట్ చేయాలి. మనల్ని మనమే చేసుకోకుంటే ఇంకెవరు చేస్తారు

సగటు తెలుగు సినిమా అభిమానిగా మంచి సినిమా రివ్యూల ద్వారా చచ్చిపోతుందన్న బాధతో